Wednesday, June 15, 2011

వర్మ గారూ - ట్విట్టరూ

నాకున్న చెడ్డ అలవాట్లకు తోడు  నేను కొన్న స్మార్టు ఫోను పుణ్యమాని ట్విట్టరు అలవాటయింది నాకు . మనకెవరూ ఫాలోయర్సు లేరు , సరే ఎవర్ని ఫాలో అవుదామా అని చూస్తే నాకు మన వర్మ గారు కనిపించారు. నాకున్న సినిమా పిచ్చికి తోడు రీసెంటుగా టీవీ -9  లో  ఆయన రజనీకాంత్ తో ఒక ఆట ఆడుకున్న తీరు గుర్తొచ్చి టక్కున ఆయనకీ ఫాలోయర్నైపోయా. 

ఈమధ్య ఆయన ట్వీట్లు చూస్తుంటే ఆయనకి  మతి చెడిందేమో , మరి కొన్నాళ్ళు ఆయనగారి ట్వీట్లు చూస్తే నాకూ అదే గతి పడుతుందేమో అని భయమేస్తోంది. రాముణ్నీ, శివున్నీ, బాబాల్నీ  ఇలా ఎవర్నీ వదిలి పెట్టడం లేదు. మచ్చుకు కొన్ని 

Prblm is Girls think men think tht Girls ar easy nd Girls nvr evr think tht men think tht Girls shud think tht girls shud be easy..subba rao


inspite of bng a fathr nd also God if he dint knw hs own son evn thn hw cud he cut off a childs head? But am sure Lord shiva knows better


I am told tht only crime of Ganpathi 2 get his Head chopped off ws tht he ws protecting hs moms modesty..But am sure Lord Shiva knows better

A movie shud b nthng 2 do wth society ..it shud hold a dreamy mirror 2 society nd entertain it wth non existent human conditions..subba rao


Marriage is like a romantic novel in which the hero dies in the first chapter


I love women I hate wives I love kids I hate children I love houses I hate homes bottom line is I hate marriage

Its a good thing that animals also don't pray to Gods..otherwise we would have also had Hindu dogs Muslim tigers and Christian snakes

If sme 8 lkh of ppl vstd sai babas funeral it provs tht rest of the pplation 99 crore 92 lak ppl of india dint blve in him..am feelng so sad

ఇలాంటి ఆణి ముత్యాలు  ఇంకెన్నో ఉన్నాయి.


May be  he wants to make us feel his movies are better than his tweets. To me it looks like having an option between "bad" and "worst". Nice strategy Mr.Varma.

OK, Will we watch your movies, can you please stop tweeting?





 

Friday, April 16, 2010

చింతకాయలీడరు

మీరు "అప్పుల అప్పారావు " సినిమా చూసారా? అందులో "నాదెండ్ల అంజయ్య" గుర్తున్నాడా? డైలాగులు మక్కీకిమక్కీ  గుర్తులేవుగాని అందులో ఒక సీను మాత్రం ఇదిగో ఇలా ఉంటుంది.

(నాదెండ్ల అంజయ్య (బాబూ మోహన్) జనాన్ని వెంటేసుకొని హీరో రాజేంద్ర ప్రసాద్ ఇంటికొస్తాడు)

హీరో: అల్లో అల్లో నాదెండ్ల అంజయ్య గారూ ఏమిటిలా జనాన్ని వెంటేసుకొచ్చారు ?
బాబూ మోహన్: నేను వెంటేసుకొని రావటం ఏమిటీ నా చింతకాయ్ (ఇది ఆయన ఊతపదం)
హీరో : మరి?
బాబూ మోహన్: (మొహం అదోలా పెట్టి) నేను వాళ్ళని వెంటేసుకు రాలేదు వాళ్ళే నన్ను ముందెట్టుకొచ్చారు.

ఈ మధ్య నాకు కేసీఆర్ ని చూసినప్పుడల్లా  ఈ సీనే గుర్తుకొస్తోంది .ఈయన అప్పుడపుడు స్టూడెంట్స్ ని వెనకేసుకొచ్చినా, చాలా సార్లు పాపం వాళ్ళే ఈయన్ని   ముందెట్టుకొస్తుంటారు(గతిలేక ).ఒకరోజు నెత్తి నెట్టుకుంటారు. ఆ మరుసటి రోజే  కిందకి దింపి ఆయన శవ యాత్రలూ లేదా  దిష్టిబొమ్మ దహనాలూ చేస్తుంటారు . వీలయితే  ఆయనకే "ఆల్టిమేటం" జారీ చేస్తుంటారు. రాజకీయ నాయకుల్లో అవినీతి పరుల్నీ, పదవి కోసం ఎంతకైనా తెగించే వారినీ , బంధు  ప్రీతి,కుల గజ్జి అణువణువునా జీర్ణించుకున్న వాళ్ళని చూసాం. కానీ ఈయన లాంటి ఏకకాలంలో హీరో కం జీరో   లాంటి లీడర్లు చాలా అరుదు. ఎవరు  ఎవర్ని  నడిపిస్తున్నారో కూడా అర్ధంగాని రీతిలో ఉద్యమాన్ని (?) నడపటం ఈయనకే చెల్లు. ఏమంటారు?

Sunday, March 21, 2010

ఉపోద్ఘాతం

హాయ్ ,

నా పేరు భారతీయుడు.మరీ మన కమలాసన్ అంత  కాకున్నా..కాస్తో కూస్తో ఆ టైపే. దేశాన్ని పట్టి పీడిస్తున్న అనేక జాడ్యాలు, మారుతున్న విలువలు, అపహాస్యం పాలవుతున్న ప్రజాసామ్యం వీటన్నిటి మధ్య సతమతమవుతున్న సామాన్యుడు. నా ఈ పోస్టుల్లో ఆ సామాన్యుడే హీరో.ఒక్క రాజకీయాలకే పరిమిత మవకుండా, క్రీడలు,సినిమాలు , మీడియా పోకడలు..ఇలా ప్రతిదానిమీద నాకు తోచిన విధంగా సైటైర్లు ఉంటాయి ఈ బ్లాగులో. నేను రాసేవి చదివి నా ఆలోచనలు మీతో పంచుకొని అలానే ఆయా విషయాల మీద మీ ప్రతిస్పందన తెలుసుకోవాలని నా కోరిక. ఆశీర్వదించండి ...

ఇట్లు
మీ
భారతీయుడు